భారత సంతతి కుటుంబం కిడ్నాప్.. విషాదాంతం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కిడ్నాప్‌నకు గురైన భారత సంతతి కుటుంబం ఘటన చివరకు విషాదాంతమైంది. అపహరణకు గురైన ఎనిమిది నెలల పాప, ఆమె తల్లిదండ్రులు, సమీప బంధువు విగతజీవులై కనిపించినట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఓ అనుమానితుణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కిడ్నాప్ అయిన వారిలో 8 నెలల చిన్నారి ఆరుహి ధేరితో పాటు ఆమె పేరెంట్స్ జస్లీన్ కౌర్, జస్దీప్ సింగ్, అమన్‌దీప్ సింగ్ ఉన్నారు. నార్త్ కాలిఫోర్నియాలోని మెర్సెడ్ కౌంటీలో ఉన్న ఓ బిజినెస్ సెంటర్ నుంచి ఆ నలుగుర్నీ కిడ్పాప్ చేశారు.
ఇండియానా రోడ్, హట్బిస్సన్ రోడ్ సమీపంలో ఉన్న ఓ తోటలో ఆ నలుగురి మృతదేహాలు లభ్యమైనట్లు మెర్సిడ్ కౌంటీ పోలీసు షరీఫ్ వెర్నర్ వార్నక్కి తెలిపారు. ఆ ఫామ్‌లో పనిచేస్నుత్న ఓ వర్క్ర్ మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కు సంబంధించిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.
బిజినెస్ సెంటర్ నుంచి జన్‌దీప్, అమన్‌దీప్‌లు చేతులు కట్టేసి కిడ్నాపర్లు తీసుకువచ్చారు. కొన్ని సెకన్ల తర్వాత చిన్నారి అరూహితో పాటు ఆమె తల్లిని కూడా బిల్డింగ్ నుంచి వచ్చారు. ఫ్యామిలీకి చెందిన నలుగుర్ని ఓ ట్రక్కులో ఎక్కించి తీసుకువెళ్లారు. ఎన్ఆర్ఐ ఫ్యామిలీ కిడ్నాప్ అయిన ఒక రోజు తర్వాత బీసెస్ మాన్యువల్ సాల్గడోను కస్టడీలోకి తీసుకున్నారు. నేరానికి పాల్పడినట్లు సాల్గడో తమ కుటుంబానికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.













