దావోస్ సదస్సు .. పర్యావరణవేత్తలకు ఆహ్వానం
స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 16-20 తేదీల్లో జరగనున్న ప్రపంచ వార్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) సదస్సులో మన దేశం నుంచి ఇద్దరు యువ పర్యావరణవేత్తలు పాల్గొనున్నారు. ఇందులో ఒకరు కరణ్ కుమార్ కాగా, మరొకరు కె.గాయత్రీ రెడ్డి, పర్యావరణానికి సంబంధించిన అంశాలకు ప్రాచుర్యం కల్పించి, సానుకూల ఫలితాలు సాధించడంలో దాదాపు 15 ఏళ్లుగా కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ సదస్సులో పాల్గొనే అవకాశం వీరికి దక్కింది. జీఎస్సీ ( గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీ) ముంబయి. బెంగళూరు కేంద్రాలకు వీరు ప్రాతినిధ్యం వహిస్తారు. ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 2500 మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజిక వ్యవహారాలు నిపుణులు పాల్గొంటారు.













