హాత్ మొండే మిసెస్ ఇండియా కు కాంతిప్రియ ఎంపిక
హాత్ మొండె మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ కాంటెస్ట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన నందిమండలం కాంతిప్రియ ఫైనల్ జాబితాకు ఎంపికయ్యారు. ప్రపంచ దేశాల్లో స్థిరపడిన భారతదేశానికి చెందిన మహిళలు కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన కాంతిప్రియ కాంటెస్ట్‌లో పాల్గొని తన సత్తాచాటారు. హాత్ మొండే ఆర్గనైజేన్ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు దుబాయ్‌లో ఫైనల్ జాబితాను ఎంపికైన మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు. జూన్ 9న ఫైనల్స్ జరపనున్నారు. నెల్లూరుకు చెందిన కాంతిప్రియ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఫైనల్ జాబితాను ఎంపిక కావడంపై బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. చదువుకునే రోజుల నుంచి సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే కాంతి ప్రియ రాబోయే రోజుల్లో పేదల కోసం విస్తృత సేవ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.













