ఎల్ బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు అమ్మాయి
యూరప్ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్ బ్రన్ శిక్షరంపై మన స్వాతంత్య్ర దినోత్సవం నాడే మున్వన్నెల జెండాను రెపరేప లాడించింది ఓ తెలుగు అమ్మాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి (23)కి ట్రెకింగ్ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆమె యూరప్ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్ బ్రస్ శిఖరాన్ని (5672 మీటర్ల) కేవలం నాలుగు రోజుల్లో అదిరోహించి అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. మన స్వాతంత్య్ర దినోత్సవం నాడే యూరప్‌లోని ఎత్తైన శిఖరంపై మన జాతీయ పతకాన్ని రెపరెపలాడించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.













