1623వ సంవత్సరం తర్వాత… ఈ అద్భుతం!
అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. రెండు మహా గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా దగ్గర కానున్నాయి. ఓ భారీ నక్షత్రంలా ప్రకాశించనున్నాయి. సౌర కుటుంబంలోని రెండు పెద్ద గ్రహాలైన గురుడు, శని ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి రానున్నాయి. ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.50 కోట్ల కిలో మీటర్లుగా ఉంటుంది. 1623వ సంవత్సరం తర్వాత జరిగే ఈ అద్భుతం ఈ నెల 21న ఖగోళ ప్రియులకు కనువిందు చేయనుంది. మహా సంయోగం గా పిలిచే ఈ అంతరిక్ష అద్భుతం భారతీయులను కూడా కనువిందు చేస్తుందని, దేశంలోని అని ప్రాంతాల వారు సూర్యాస్తమయం తర్వాత చూడవచ్చని కోల్కతా లోని జేపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేవీ ప్రసాద్ దురై తెలిపారు.













