జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఒప్పందం కూడా దాడులకు ఒక కారణం అయ్యి ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్‌తో కలిసి పాత్రికేయ సమావేశం నిర్వహించిన బైడెన్ ఇజ్రాయెల్ హమాస్ దాడుల గురించి స్పందించారు. హమాస్ దాడుల వెనుక భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రకటన కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. దీనికి సంబంధించి రుజువులు మా దగ్గర లేకున్నా, అది నేను నమ్ముతాను. ఇజ్రాయెల్ కోసం, ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన పురోగతి అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ కారిడార్ విషయంలో వెనక్కి తగ్గం అని బైడెన్ స్పష్టం చేశారు.













