విక్రయానికి వాషింగ్టన్ పోస్ట్!
అమెరికాలో ప్రముఖ వార్త పత్రిక ద వాషింగ్టన్ పోస్ట్ విక్రయానికొచ్చినట్లు తెలుస్తోంది. 2013లో 250 మిలియన్ డాలర్లకు దీనిని సొంతం చేసుకున్న జెఫ్ బెజోస్ ఇపుడు ఒక పుట్‌బాల్ టీమ్‌ను కొనడం కోసం దీనిని అమ్మాలని చూస్తున్నారట. వాషింగ్టన్ కమాండర్స్ అనే పుట్‌బాల్ టీమ్ కోసం ఈ ప్రతిష్టాత్మక వార్త పత్రికను అమెజాన్ వ్యవస్థాపకుడు త్వరలోనే విక్రయించనున్నట్లు తెలిసింది. గత నెలలో ఆ పత్రిక ప్రచురణ కర్త ఫ్రెడ్ రియాన్ లేఆఫ్ ప్రణాళికలను వెల్లడిస్తున్న ఒక వీడియో లీక్ కావడంతో, ఈ విక్రయ వార్తలు జోరుందుకున్నారు. అయితే ఆ తర్వాత అటు వార్త పత్రిక ప్రతినిధులు, ఇటు బెజోస్ కూడా వాషింగ్టన్ పోస్టును విక్రయించడం లేదని పేర్కొన్నారు.













