జీ-7 సదస్సులో కరోనా కలకలం!

లండన్ జీ-7 సదస్సులో కరోనా వైరస్ కలలకం సృష్టించింది. జీ-7 సదస్సులో పాల్గొనేందుకు భారత్ తరపున హాజరైన ప్రతినిధి బృందంలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్‍గా తేలినట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. జీ 7 గ్రూప్‍లో భారత్ సభ్య దేశం కాదు..అయినప్పటికీ లండన్‍లో జరిగే ఈ సదస్సుకు భారత్‍తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా దేశాలలను బ్రిటన్ ఆహ్వానించింది. జీ7 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‍కు మాత్రం పాజిటివ్ రాలేదని తెలిపింది. దీంతో భారత బృందం మొత్తం ఐసోలేషన్‍లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ బృంద సభ్యుల్లో కొందరు వైరస్‍కు గురైనట్లు తెలిసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా నేడు పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలను వర్చువల్ ద్వారా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. నేడు జరిగే సమావేశంలో వర్చువల్ పద్ధతిలోనే పాల్గొంటాను అని తెలిపారు.