అగ్రరాజ్యానికి భారత్ కౌంటర్
రష్యాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో అగ్రరాజ్యానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిలు కొనుగోళ్ల విషయమై ప్రశ్నించిన అమెరికా ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో రష్యాను ఎందుకు వ్యతిరేకించడం లేదంటూ నిలదీసింది. అయితే ప్రతీ దానికి భారత్‌ను ప్రశ్నించే బదులు ముందు యూరప్ దేశాలను నిలదీస్తే బాగుంటుందని అమెరికను సున్నితంగా కౌంటర్ ఇచ్చింది. భారత్, అమెరికా 2G2 భేటీ తర్వాత ప్రశ్నల సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఆయిల్ కొనుగోళ్ల గురించి మీరు ప్రస్తావించినట్లు నా దృష్టికి వచ్చింది. రష్యా నుంచి కొనుగోళ్లను గనుక పరిశీలిస్తే ముందు యూరప్ మీద దృష్టి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. మేం కేవలం ఎనర్జీ సెక్యూరిటీ కోసమే కొనుగోలు చేస్తున్నాం. కానీ గణాంకాలు మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఒక నెలలో మొత్తం మేం కొనుగోలు చేస్తే ఎనర్జీ యూరప్ దేశాలు ఒక్క పూటలోనే చేస్తున్నాయని, కాబట్టి ఆ అంశంపై ఆలోచిస్తే మంచిదని జైశంకర్ అగ్రరాజ్యానికి కౌంట్ ఇచ్చారు.













