ట్రంప్ వ్యాఖ్యలు సిగ్గు చేటు : ఇజ్రాయెల్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ సీరియస్‌గా స్పందించింది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌ను ట్రంప్ ప్రశంసిస్తూ, అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును విమర్శించడం సిగ్గుచేటు అని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. అమెరికా మాజీ అధ్యక్షుడైన వ్యక్తి ఇజ్రాయెల్ పౌరులు, పోరాట యోధుల స్ఫూర్తిని కించపరిచేలా, ప్రచారానికి ఊతమిచ్చేలా మాట్లాడడం సిగ్గు చేటు అని ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ప్లోమో పేర్కొన్నారు. వెస్ట్ పామ్ బీచ్‌లో జరిగిన ర్యాలీలో భాగంగా ట్రంప్ ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ బలహీనతలను బహిరంగ పరిచినందుకు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఆయన విమర్శించారు. ఇది హిజ్బుల్లాను దాడులకు ప్రేరేపించినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.













