ఐసిస్ లో 66 మంది భారతీయ సంతతి వారు : అమెరికా
అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో భారత సంతతికి చెందిన వారు 66 మంది వున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజా నివేదికలో వెల్లడిరచింది. తీవ్రవాదంపై 2020 నివేదికలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ విడుదల చేశారు. విదేశీ తీవ్రవాదులను గతేడాది కాలంలో భారత్‌కు అప్పగించలేదని ఆ నివేదిక పేర్కొంది. తీవ్రవాదంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2309ని అమలు చేయడంపై అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయని బ్లింకెన్ తెలిపారు. విమానాశ్రయాల్లో సరుకు రవాణా పరిశీలనకు డ్యూయల్ స్క్రీన్ ఎక్స్‌రేను తప్పనిసరి చేయాలన్న నిబంధన కూడా అమలు చేస్తున్నామన్నారు. తీవ్రవాదంపై పోరులో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రూపొందించడాన్ని అమెరికా కొనసాగిస్తోందని ఆ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ, ప్రాంతీయ తీవ్రవాద శక్తులను గుర్తించి, పట్టుకోవడంలో ఎన్ఐఏతో సహా భారత సంస్థలు చేస్తున్న కృషిని ప్రశంసించింది. సెప్టెంబరు మాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ఐపిస్కి సంబంధించిన 34 తీవ్రవాద సంబంధిత కేసులను విచారించిందని, 160 మందిని అరెస్టు చేసిందని ఆ నివేదిక తెలిపింది.













