అమెరికన్ నిఘా విభాగం సంచలన నివేదిక.. పుతిన్ కు
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికన్ నిఘా విభాగం ఓ సంచలన నివేదిక వెల్లడిరచింది. పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకుంటున్న స్టెరాయిండ్ల వల్లే పుతిన్‌లో విపరీత ఆలోచనలు వస్తున్నాయోమోనని నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై దాడితోపాటు అణ్వస్త్ర బలగాలను సన్నద్ధంగా ఉండాలని చెప్పడం వెనుక న్టెరాయిడ్ల వాడకం ఉండొచ్చని అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదిక తెలియజేస్తోంది. పుతిన్ ముఖంలో వస్తున్న మార్పులు దీనికి బలం చేకూరుస్తున్నాయని వెల్లడించింది. పుతిన్ ఎవరిని కలిసిన 13 అడుగుల టేబుల్ గ్యాప్ పెట్టడాన్ని కూడా అనుమానంగా చూస్తున్నారు. అయితే అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదికపై రష్యా స్పందించాల్సి ఉంది.













