ఫ్రీస్టయిల్ లో డేనియల్ ప్రపంచ రికార్డు
యూరోపియన్ షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్లో ఐర్లాండ్ స్విమ్మర్ డేనియల్ విఫెన్ 800 మీ. ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాకు చెందిన గ్రాంట్ హాకెట్ పేరిట ఉన్న రికార్డును మెరుగుపరుస్తూ విఫెన్ 7ని.20.46 సె.లో గమ్యాన్ని చేరాడు. 15 ఏళ్ల క్రితం హాకెట్ నెలకొల్పిన రికార్డు కంటే విఫెన్ మూడు సెకండ్ల ముందే రేస్‌ను పూర్తి చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన డేవిడ్ ఆబ్రి రజతం, ఉక్రెయిన్‌కు చెందిన మిఖైలొ రొమాంచుక్ కాంస్యం దక్కించుకున్నారు. కాగా విఫెన్ 400మీ, 1500 మీ. విభాగాలలో కూడా స్వర్ణాలు సాధించాడు.













