ఆ దాడిలో మా ప్రమేయం లేదు.. ఇరాన్
ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీపై జరిగిన దాడిలో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. అమెరికాలో రష్దీపై జరిగిన దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని, ఈ సంఘటనపై ఎవరినైనా నిందించవలసి వస్తే అది ఆయనను (రస్దీ), ఆయన అనుచరులను మాత్రమే నిందించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కన్నాని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై ఇరాన్ను నిందించే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. న్యూయార్క్లో ఓ కార్యక్రమానికి వెళుతున్న 75 ఏళ్ల సల్మాన్ రష్దీ కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దాడిలో ఆయన కాలేయం దెబ్బ తినడంతో చేతి నరాలు తెగిపోయాయి. ఒక కంటికి బలమైన గాయం తగిలింది. గాయపడిన కన్నును ఆయన కోల్పోవచ్చని రష్దీ ప్రతినిధి ఒకరు తెలిపారు.













