భద్రతా మండలిలో మాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి
ప్రపంచంలో ఉన్న వైవిధ్యం ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి కూర్పులో కనిపించడం లేదని భారతదేశం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భద్రతా మండలికి నాయకత్వం వహిస్తున్న భారత్ ఓ సిద్ధాంత పత్రాన్ని రూపొందించింది. కొత్తగా వచ్చిపుడుతన్న పలు సమస్యలతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భారత్ లాంటి వర్ధమాన దేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యతం కల్పించాల్సిన అవసరాన్ని అందులో నొక్కి చెప్పింది. 1965లో ఏర్పడిన మండలిలో ఇప్పటి పరిస్థితులకు తగినట్లు సంస్కరణలు చేయకపోవడం దాని విశ్వసనీయతను దెబ్బతీస్తోందని హెచ్చరించింది. శాంతి, భద్రతలు, అభివృద్ధి, మానవ హక్కులనే పునాదులపై ఏర్పడిన ఐక్యరాజ్య సమితి సంస్కరణల దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించింది. 2005లో పలువురు దేశాధినేతలు ఐరాస కూర్పునకు సంబంధించిన పలు మార్పులను ప్రతిపాదించినా నిర్ధిష్ట కాల పరిమితి లేకపోవడంతో అమలుకు నోచు కోలేదని సిద్ధాంత పత్రంలో భారత్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 15 దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలికి డిసెంబరు 1 నుంచి 31 వరకు భారత్ నాయకత్వం వహిస్తుంది. ఈ నెల 14, 15 తేదీల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగే సమావేశాల్లో బహుళపక్ష భాగస్వామ్యానికి చేపట్టాల్సిన సంస్కరణలు, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలను భారత్ ప్రముఖంగా ప్రస్తావించనుంది.













