ఈ నెల చివరి నాటికి చైనాను దాటనున్న భారత్
ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ ఈ నెల చివర వరకు దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ నెల చివరి నాటికి ఇండియా జనాభా 1.425 బిలియన్లు అవుతుందని యునైటెడ్ నేషన్స్ పేర్కొన్నది. అయితే 2064 నాటికి భారతీయ జనాభా ఓ స్థిరత్వానికి వస్తుందని, ఇక ఈ శతాబ్ధం చివరినాటికి భారత్ జనాభా 1.5 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచిపోతుందని యూఎస్ అధికారి వెల్లడించారు. ఏప్రిల్ చివరి నాటికి చైనాను ఇండియా దాటేస్తుందని, 2022లో చైనా జనాభా 1.4 బిలియన్కు చేరుకుందని, ఆ తర్వాత తగ్గుదల ప్రారంభమైనట్లు యూఎన్ పాపులేషన్ డివిజన్ డైరెక్టర్ జాన్స్ విల్మోత్ తెలిపారు. ఇక ఈ శతాబ్ధం చివరి నాటికి జనాభా ఒక బిలియన్ లోపు ఉండిపోతుందని విల్మోత్ తెలిపారు. కానీ దీనికి విరుద్ధంగా ఇండియాలో మాత్రం జనాభా కొన్ని దశాబ్ధాల పాటు పెరుగుతూ పోతుందని యూఎన్ అధికారి అంచనా వేశారు. ఇండియాలో జనాభా పెరుగుదల 2064 వరకు ఉంటుందని ఆ తర్వాత వేగం మందగిస్తుందని మరో ఐక్యరాజ్యసమితి ఆఫీసర్ సారా హెర్టోగ్ తెలిపారు.













