చైనాను దాటేసిన భారత్… ప్రపంచంలోనే
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29 లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలు పెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు 2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్లో అత్యధికంగా 142,86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. మనోతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడిరచింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉన్న అమెరికా 34 క్లో మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది.













