వారిలో భారతీయులే అధికం : బ్రిటన్
ఇంగ్లండ్, వేల్స్లలో నివసిస్తున్న ప్రతి ఆరుగురిలో ఒకరు బయటి దేశంలో జన్మించిన వారేనని బ్రిటన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జనాబా లెక్కల ఆధారంగా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భారతీయులు 1.5 శాతంతో మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే ఆఫీసర్స్ ఫర్ నేషనల్ స్టాఇస్టిక్స్ (ఓఎన్ఎస్) ప్రకారం గత సంవత్సరం బ్రిటన్ వెలుపల జన్మించిన వారిలో భారతీయుల సంఖ్య 9 లక్షల 20 వేలు (1.5 శాతం)గా ఉండగా, ఆ తరువాత పోలండ్ 7 లక్షల 43 వేలు (1.2 శాతం), పాకిస్థాన్ 6 లక్షల 24 వేల (1 శాతం) మందితో తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఓఎన్ఎస్ పేర్కొంది. 2011లో బయటి దేశాల్లో పుట్టి బ్రిటన్లో నివసిస్తున్న వారి సంఖ్య 75 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య కోటికి చేరినట్లు వెల్లడించింది.













