అమెరికాలో భారత బాలిక అదృశ్యం
అమెరికాలో భారత సంతతికి చెందిన దంపతుల 14 ఏండ్ల కుమార్తె అదృశ్యమైంది. అర్కన్సాస్ లోని కాన్వేల్ నివసిస్తున్న పవన్ రాయ్ మారుపల్లి, శ్రీదేవిల కుమార్తె తన్వీ మారుపల్లి మూడు వారాల క్రితం గత నెల 17న స్కూల్ బస్ ఎక్కి వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. తన పేరెంట్స్ ఉద్యోగాలు పోతే ఎక్కడ అమెరికా వదిలి వెళ్లాలేమోనన్న భయంతోనే తన్వీ ఇంటి నుంచి పారిపోయి ఉండవచ్చునని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అమెరికాలో మాంద్యం కారణంగా తన్వీ తల్లి ఉద్యోగాన్ని కోల్పోగా, ఆమె తండ్రి కూడా జాబ్ కోల్పోయే పరిస్థితిలో ఉన్నట్లు తెలిసింది.













