బ్రిటన్ లో భారతీయ విద్యార్థి వినూత్న కార్యక్రమం
చదువుకునేందుకు బ్రిటన్ వెళ్లిన వివేక్ గురవ్ అనే ఓ భారతీయ విద్యార్థి అక్కడ 30 నగరాల్లో చెత్త ఏరుతున్నాడు. తనతో పాటు వేల మందిని కలుపుకొని క్లీన్ బ్రిటన్ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇందుకోసం ప్లాగింగ్ అనే వినూత్న కార్యక్రాన్ని చేపట్టాడు. జాగింగ్ చేస్తూ దారిలో చెత్త ఏరడమే దీని ఉద్దేశం. స్వీడన్లో ఇలాంటి కార్యక్రమం చేస్తారని తెలుసుకొని మొదట తన సొంత నగరం పుణెలో 2018లో ప్రారంభించాడు. పుణె ప్లాగర్స్ పేరున ఒక సంస్థను ఏర్పాటు చేసి 10 లక్షల కిలోల చెత్త తొలగించాడు. తర్వాత స్కాలర్షిప్ రావడంతో చదువుకోడానికి బ్రిటన్ వెళ్లాడు. అక్కడా ప్లాగింగ్ను కొనసాగించాడు.













