ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిని 11 సార్లు కత్తితో పొడిచాడు ఓ దుండగుడు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్లో పీహెచ్డీ చేస్తున్న శుభమ్ గార్గ్‌ను 11 సార్లు కత్తితో పొడిచారు. అక్టోబర్ ఆరవ తేదీన ఆ ఆటాక్ జరిగింది. శుభమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విద్వేష దాడిగా గమనిస్తున్నారు. ఐఐటీ మద్రాసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శుభమ్ సెప్టెంబర్ ఒకటో తేదీన ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్టోబర్ ఆరో తేదీన రాత్రి 10:30 నిమిషాలకు రోడ్డుపై వెళ్తున్న శుభమ్‌ను ఓ వ్యక్తి అడ్డగించాడని, అతని వద్ద ఆ వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. డబ్బులు ఇవ్వలేమని చెప్పినప్పుడు, ఆ దుండగుడు కత్తితో శుభమ్‌పై దాడి చేశాడు. ముఖం, ఛాతి, కడుపులో శుభమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శుభమ్‌కు పలు సర్జరీలు అయినట్లు అతని సొదరి తెలిపింది. ఈ ఘటనలో 27 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. శుభమ్ పేరెంట్స్ యూపీలోని ఆగ్రాలో నివసిస్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్లేందుకు వాళ్లు వీసా కోసం ప్రయత్నిస్తున్నారు.













