లండన్ మేయర్ బరిలో భారత సంతతి వ్యక్తి
లండన్ మేయర్ పదవికి 2024లో జరగనున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు భారతీయ సంతతికి చెందిన తరుణ్ గులాటీ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లండన్ నగరాన్ని ప్రముఖ గ్లోబల్ సిటీగా మార్చడమే తన లక్ష్యమన్నారు. లండన్ వాసులందరూ సురక్షితంగా ఉండేలా కృషి చేస్తానని, నిరుద్యోగులు, తక్కువ ఆదాయం ఉన్న వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా తనకు లండన్ మేయ్గా అవకాశం ఇస్తే చక్కని పాలనందిస్తానని తెలిపారు. ఒక పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తే విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేమని, అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడనున్నట్లు స్పష్టం చేశారు.













