భారత సంతతి జర్నలిస్ట్ కు… పులిట్జర్ పురస్కారం

ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారాన్ని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్ దక్కించుకున్నారు. అమెరికాలోని వార్తాపత్రిక, పత్రికా ఆన్‍లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పులలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మేఘ రాజగోపాలన్ మరో ఇద్దరితో కలిసి గెలుచుకున్నారు. మేఘ రాజగోపాలన్ పరిశోధాత్మక కథనం, అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2017లో జిన్జియాంగ్‍లో చైనా వేలాది మంది ముస్లింలను నిర్బంధించేందుకు డ్రాగన్ రహస్యంగా నిర్మించిన జైళ్లు, సామూహిక నిర్భంధ శిబిరాలను ఈ జర్నలిస్టు బహిర్గతం చేసింది. అమెరికా బజ్‍ఫీడ్ న్యూస్ సంస్థలో పని చేస్తున్న మేఘ రాజగోపాలన్, అలిసన్ కిల్లింగ్, క్రిస్టో బుస్చెక్ తమ పరిశోధనాత్మక కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించారు.
చైనా వీగర్ ముస్లింల హక్కులను కాలారాస్తుందంటూ పలు దేశాల్లో మైనార్టీలు ఆందోళనలు చేశారు. మేఘ చర్యలను తీవ్రం పరిగణించిన చైనా ఆమెను నిశ్శబ్దంగా ఉంచేందుకు చాలా ప్రయత్నించింది. మేఘ వీసాను రద్దు చేసిందని, ఆమెను దేశం నుంచి వెళ్లిపోవాలని బెదిరించింది అని బజ్‍ఫీడ్ న్యూస్ బహుమతి కోసం పంపిణ తన ఎంట్రీలో వెల్లడించింది.
డ్రాగన్ బెదిరింపులకు భయపడని మేఘన మరో ఇద్దరి సాయంతో లండన్ నుంచి పని చేయడం ప్రారంభించారు. వీరిలో ఒకరు అలిసన్ కిల్లింగ్, లైసెన్స్ పొందిన ఆర్కిటెక్చర్, భవనాల ఉపగ్రమ చిత్రాల ఫోరెన్సిక్ విశ్లేషణలో నైపుణ్యం కలిగినవాడు కాగా మరొకరు క్రిస్టో బుస్చెక్ డాటా జర్నలిస్టుల కోసం టూల్స్ రూపొందించే పోగ్రామర్. ఈ ముగ్గురి బృందం చైనా సెన్సార్ చేసిన వేలాది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి అక్కడ జరుగుతున్న అరాచకాలను ప్రపంచానికి వెల్లడించారు. ప్రస్తుతం లండన్‍లో ఉంటున్న వేఘన పులిట్జర్ గెలవడంపై స్పందిస్తూ ఈ అవార్డు గెలుచుకుంటానని తాను అస్సలు ఊహిచలేదని పూర్తిగా షాక్‍లో ఉన్నాను అన్నారు మేఘన.