ఐర్లాండ్ నూతన ప్రధానిగా భారత సంతతి వ్యక్తి లియో
ఐర్లాండ్ నూతన ప్రధాని మంత్రిగా భారత సంతతికి చెందిన లియో వరద్కర్ ఎన్నికయ్యారు. ఫైన్ గేల్ పార్టీకి చెందిన లియో వరద్కర్ ఐరీస్ డిప్యూటీ ప్రధాన మంత్రిగా పని చేశారు. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో ఆయన్ని ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారు. ఆయనకు అనుకూలంగా 87 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 62 మంది ఓటు వేశారు. వరద్కర్ ప్రధానిగా ఎన్నికైనట్లు అద్యక్షుడు మైకేల్ డి. హిగ్గిన్స్ ప్రకటించారు. ఆయన ఐరీష్ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 2017 నుంచి 2020 వరకు ఆయన మొదటిసారి ప్రధానిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన ఫెన్నా ఫేయిల్ అండ్ గ్రీన్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.













