టెస్లా ఆటోపైలట్ టీమ్ తొలి ఉద్యోగిగా.. భారత సంతతి ఇంజనీర్
భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామికి అరుదైన గౌరవం దక్కింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకి చెందిన ఆటోపైలట్ టీమ్‌లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. ముందుగా అశోక్ ఎల్లు స్వామిని రిక్రూట్ చేసుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మాస్క్ వెల్లడిరచారు. టెస్లా ఆటోపైలట్ టీమ్ ప్రారంభిస్తోందని నేను ట్వీట్ చేసిన తర్వాత రిక్రూట్ అయిన మొట్టమొదటి వ్యక్తి అశోక్. టెస్లా ఆటోపైలట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టీమ్ అత్యంత ప్రతిభావంతమైనది అని మైక్రో బ్లాగింగ్ సైట్ పేర్కొన్నారు. అశోక్ ఆటోపైలట్ ఇంజనీరింగ్ హెడ్‌గా ఉన్నారని తెలిపారు. టెస్లాలో చేరడానికి ముందు అశోక్ ఫోక్స్ వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్, డబ్ల్యూఏబీ సీవో వెహికల్ కంట్రోల్ సిస్టమ్‌లో పని చేశారు. ఆయన చెన్నైలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశారు.













