భారతీయుడికి టెక్సాస్ కోర్టు జైలుశిక్ష…

విభేదాలు వచ్చి వేరుగా ఉంటున్న భార్యను కిడ్నాప్ చేసి, తీవ్రంగా కొట్టిన కేసులో సునీల్ కె.ఆకుల (32)అనే భారతీయుడికి అమెరికాలోని టెక్సాస్ కోర్టు 56 నెలలు జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత అతడిని అమెరికా నుంచి భారత్‍కు పంపించివేసే అవకాశాలున్నాయి. సునీల్ కె.ఆకులపై కిడ్నాప్, దాడి, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది నవంబరులో సునీల్ నేరాన్ని అంగీకరించాడు. సునీల్ 2019 ఆగస్టు 6న టెక్సాస్‍లోని తన ఇంటి నుంచి కారులో మసాచుసెట్స్లోని అగవమ్‍లో నివసించే తన భార్య అపార్టుమెంట్‍కు వెళ్లాడు. అక్కడ ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చి, కారులో టెక్సాస్‍కు తీసుకొచ్చాడు. అనంతరం కారులో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెను దారుణంగా కొట్టి హింసించాడు.