ఆస్ట్రేలియా పర్యటనలో భారత విదేశాంగ శాఖ మంత్రి

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖ్వాద్ విదేశాంగ మంత్రుల భేటీ నేపథ్యంలో జైశంకర్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్ డ్టన్‌తో భేటీ అయ్యారు. భారత్, ఆస్ట్రేలియా సంబంధాల్లో రక్షణ, భద్రత ఈ రెండే కీలక అంశాలని జైశంకర్ అన్నారు. అదే విధంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్, పౌర సంబంధాల మంత్రి అలెక్స్ హకే తో కూడా భేటీ అయ్యారు. ప్రవాస భారతీయుల విషయం, కరోనా మహమ్మారి, ప్రస్తుతం ఉన్న సవాళ్ల గురించి చర్చించుకున్నామని ఆస్ట్రేలియా మంత్రి అలెక్స్ హకే తెలిపారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్.జైశంకర్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఇదే ప్రథమం.