ఐరాస భద్రతా మండలిలో భారత జాతీయ జెండా!
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తాత్కాలిక సభ్య దేశంగా గతేడాది భారత్ ఎనిమిదోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఓటింగ్లో సర్వ ప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు భారత్కు మద్దతు పలికాయి. అయితే భారత్ 2021, జనవరి 1 నుంచి 2022 చివరి నాటికి తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఐరాస భద్రత మండలిలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితిలో భారత శ్వాత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. భారత్తో పాటు నార్వే, కెన్యా, మెక్సికో, ఐర్లాండ్ దేశాలు కూడా తాత్కాలిక సభ్య దేశాలుగా రెండేళ్ల పాటు కొనసాగనున్నాయి.
యూఎన్లో ప్రస్తుతం అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. తాత్కాలిక సభ్య దేశాలుగా ఈస్తోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్, గ్రైనడైన్స్, ట్యునీషియా, వియత్నాం ఉన్నాయి.













