భారతీయుడికి జాక్‌పాట్
షార్జాలో ఉంటున్న ఓ భారతీయుడు లాటరీ గెలుచుకున్నాడు. అబుధాబి బిగ్ టికెట్ లాటరీలో ఆయనకు జాక్‌పాట్ తగిలింది. కర్నాటకకు చెందిన శివమూర్తి కృష్ణప్ప 2005లో యుఎఇ వెళ్లి, అక్కడ ఓ సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆయన 202511 అనే నెంబర్ గల లాటరీ టికెట్ కొన్నారు. ఈ టికెట్ పై ఆయన 12 మిలియన్ దిర్హమ్లను గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ.13.85 కోట్లు ఉంటుంది. గతంలో మిత్రులతో కలిసి టికెట్ కొనేవాడినని, అయితే ఈసారి తానొక్కడినే టికెట్ కొన్నట్టు శివమూర్తి కృష్ణప్ప తెలిపారు. తనకు లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో సొంత గ్రాంలో ఇట్లు కట్టుకుంటానని, మిగిలిన మొత్తాన్ని తన పిల్లల పేరిట బ్యాంకులో డిపాజిట్ చేస్తానని ఆయన పేర్కొన్నారు.













