తాలిబన్ లతో మొదటిసారిగా సమావేశమైన భారత్
తాలిబన్ లతో భారత్ మొదటిసారిగా సమావేశమైంది. దోహాలోని భారత్ ఎంబసీ ఈ సమావేశం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఆఫ్ఘన్, ఆర్మీ ఆఫీసర్గా పష్తున్ అయిన స్టానెక్జాయ్కు శిక్షణ ఇచ్చారు. ఆయన మూడు రోజుల క్రితం ఒక ప్రకటన చేస్తూ భారత్తో సాధారణ వాణిజ్య దౌత్య రాజకీయ సంబంధాలను పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. తొలుత భారత్ దీనిపై మౌనంగానే వుంది. కానీ అమెరికా తన బలగాల ఉపసంహరణను పూర్తి చేసిన అనంతరం సమావేశమైంది. అన్ని పక్షాల వారీతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భారత్ చెబుతూ వచ్చింది. కాని ఈసారి సమావేశాన్ని అధికారికంగా ధృవీకరించింది. భారత్కు రావాలనుకునే వారిని సురక్షితంగా పంపించే విషయంపైనే భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ వారు కాబూల్ వదిలివెళ్ళడానికి తాలిబన్ ల అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు.













