ఉక్రెయిన్ నుంచి బయటకు రావాలి …
యుద్ధ వాతావరణం, అనిశ్చితి దృష్ట్యా ఉక్రెయిన్ నుంచి బయటకు రావాలని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది. భారతీయ విద్యార్థులు చార్టర్ విమానాల గురించి అప్డేట్ల కోసం సంబంధిత స్టూడెంట్ కాంట్రాక్టర్లను సంప్రదించాలని ఇతరత్రా వివరాల కోసం రాయబార కార్యాలయం ఫేస్బుక్ వెబ్సైట్, ట్విట్టర్లను అనుసరించాలని సూచించింది. అంతకు ముందు ఫిబ్రవరి 15న కైవ్‌లోని రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను దేశం విడిచిపెట్టే అంశం పరిశీలించాల్సిదిగా కోరింది. రష్యా దండయాత్ర భయాల నేపథ్యంలో పౌరులను తరలించే తక్షణ ప్రణాళికలు లేవని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. బోరిస్సిల్లోని ఉక్రెయిన్ అంతర్జాతీయ విమానావ్రయం నుంచి ఈనెల 22, 24, 26 తేదీల్లో ఎయిరిండియా ప్రత్యేక విమానాలు నడుపుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.













