చైనా చేరుకున్న తర్వాతే ..భారతీయ విద్యార్థులకు ఎంబసీ సూచన
కొవిడ్ లాక్డౌన్ కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు పరిస్థితులు కుదుటపడటంతో ఇప్పుడు మళ్లీ చైనా కళాశాలలకు క్రమక్రమంగా తిరిగి వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బీజింగ్ వీసాల జారీ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇలా చైనాకు తిరిగి వస్తున్న విద్యార్థులు దౌత్యపరమైన అవసరాల నిమిత్తం బీజింగ్‌లోని తమ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని భారతీయ ఎంబసీ వెబ్సైట్ నోటీసు ద్వారా కోరింది. 23 వేల మందికి పైగా భారత విద్యార్థులు చైనా విద్యాసంస్థలో చదువులు కొనసాగిస్తున్నారు. వీరిలో వైద్య విద్యార్థులు అధికభాగం ఉన్నారు. చైనా ఇపుడు వీసా ఆంక్షలను సడలించినా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హాంకాంగ్ తదితర మార్గాల మీదగా ఇప్పటికి వందమందికి పైగా బారత విద్యార్థులు చైనాకు చేరుకొన్నట్లు సమాచారం. చైనా చేరుకునే తర్వాతే విద్యార్థులు నమోదు ఫారం నింపాల్సి ఉంటుందని భారత ఎంబసీ అధికారులు తెలిపారు.













