ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా : నిర్మలా సీతారామన్
అంతర్జాతీయంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ వృద్ధిలో భారత్ ముందుకు దూసుకెళ్లబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫైనాన్స్ కమిటీ ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల ప్రపంచ ఆర్థికం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్న వేళ ఈ సమావేశం జరుగుతోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మాత్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదు చేయబోతోందని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం కట్టడి చేస్తూనే వృద్ధిని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. గడిచిన 25 నెలలుగా దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్స్‌లో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే అతి తక్కువ లావాదేవీ ఖర్చుతో ఆదాయం కలిగిన దేశాలను ఐఎంఎఫ్ వనరులను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.













