భారతీయుడికి జాక్ పాట్ … లాటరీలో
దుబాయ్‌లో ఉండే భారతీయ డ్రైవర్‌కు జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. బిగ్ టికెట్ డ్రాలో భారత్‌కు చెందిన కారు డ్రైవర్ రెంజిత్ సోమరాజన్ 20 మిలియన్ దిర్హమ్స్ (రూ.40.57 కోట్లు) గెలుచుకున్నాడు. జూన్ 29న తొమ్మిది మంది స్నేహితులతో కలిసి సోమరాజన్ కొన్న లాటరీ టికెట్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది. దాంతో తాను గెలుచుకున్న ప్రైజ్‌మనీని మిగతా తొమ్మిది మందితో పంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సోమరాజన్ తెలిపారు. గత మూడేళ్లుగా అబుధాబి బిగ్ టికెట్‌తో తాము 10 మంది కలిసి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నామని, ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నగదుతో తాను సొంత బిజినెస్ ప్రారంభించనున్నట్లు సోమరాజన్ చెప్పారు. 2008 నుంచి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న సోమరాజన్ స్వస్థలం కేరళోని కొల్లాం జిల్లా. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని సమానంగా పంచుకుంటామని చెప్పాడు.













