అగ్రరాజ్యంలో భారతీయుల హవా
అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు సత్తా చాటుతున్నారు. జనాభా గణనపై తాజా విడుదలైన ఓ నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అమెరికాలో ఎన్ఆర్ఐల సగటు కుటుంబ సంపాదన రూ.91.83 లక్షలు. అమెరికన్ల సగటు కుటుంబ సంపాదన (రూ.47.45 లక్షలు) కంటే భారతీయుల ఆదాయం రెండింతలు. అమెరికాలో 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 16 లక్షల మంది వీసాదారులు. 14 లక్షల మంది శాశ్వత పౌరసత్వం గలవారు. మరో 10 లక్షల మంది ఆ దేశంలో జన్మించిన వారు. అమెరికాలో కాలేజీ గ్రాడ్యుయేట్లు 34 శాతం ఉండగా, భారతీయుల సగటు 79 శాతం అమెరికాలో నివసిస్తున్న ఆసియా దేశాల వారితో పోల్చితే సంపాదనలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.
సగటు కుటుంబ సంపాదనలో భారతీయుల తర్వాతి స్థానాల్లో తైవాన్ దేశస్తులు (రూ.72.11 లక్షలు). ఫిలిప్పీన్లు సంపాదన (రూ.70.33 లక్షలు) నిలిచారు. జాతీయ సగటు కుటుంబ సంపాదన రూ.(రూ.47.45 లక్షలు)తో పోలిస్తే కేవలం 14 శాతం మంది ఎన్ఆర్ఐల ఆదాయం (రూ.29.60 లక్షలు) తక్కువగా ఉంది. అత్యధిక వేతనాలు ఇచ్చే ఐటీ, ఆర్థిక, వైద్య రంగాల్లో ప్రవాస భారతీయుల సత్తా చాటుతున్నారు. అమెరికా వైద్యుల్లో భారత సంతతి వారు 9 శాతం మంది ఉన్నారు. మొత్తం 50 శాతం మందికి పైగా వలసదారులు ఉన్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో అమెరికాలో ఆసియన్ల జనాభా ఏకంగా మూడు రెట్లు పెరిగింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా ఆసియన్లదే.













