భారతీయ అమెరికన్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

చేయని చికిత్సకు నకిలీ బిల్లులు సృష్టించి ఐదేండ్ల వ్యవధిలో రోగుల నుంచి 5.2 కోట్ల డాలర్లు (రూ.376 కోట్లు) వసూలు చేసిన భారతీయ అమెరికన్, నర్స్ ప్రాక్టిషనర్‍కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. నర్సుగా సేవలందించే త్రివిక్రమ్ రెడ్డి (39) రోగుల చికిత్సకు సంబంధించిన కొన్ని నకిలీ బిలుల్లను సృష్టించేవాడు. ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసి, వైద్యుల సంతకాలను ఫోర్జరీ చేసి వీటిని సృష్టించినట్టు టెక్సాస్ అటార్నీ ప్రెరెక్ షా తెలిపారు. ఇలా 2014-19 మధ్య అతడు రూ.376 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు.