గ్రీన్‌కార్డుల కోసం భారతీయుల ధర్నా
అమెరికాలో స్థిర నివాసానికి గ్రీన్‌కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఇండియన్ -అమెరికన్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది క్యాపిటల్ భవనం ముందు ధర్నా చేశారు. గ్రీన్‌కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో రోగులకు విశేషమైన సేవలు అందిస్తున్నామని, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నామని ఆందోళనలో పాల్గొన్న డాక్టర్ రాజ్ కర్ణాటక్, డాక్టర్ ప్రణవ్ సింగ్‌లు చెప్పారు. తాము అమెరికాలోనే శిక్షణ పొంది, ఇక్కడే పనిచేస్తున్నామని తెలిపారు. గ్రీన్‌కార్డులు ఇవ్వకపోవడంతో వేరే చోటుకి, వేరే ఉద్యోగానికి మారలేకపోతున్నామని అన్నారు.













