ఇండో – అమెరికన్ వ్యాపారవేత్త రమేశ్ భూటాడా భారీ విరాళం
అమెరికాలోని ఫ్లోరిడాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలను బోధిస్తున్న హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (హెచ్యుఏ)కు ఓ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త భారీ విరాళాన్ని ప్రకటించారు. హ్యూస్టన్‌లోని స్టార్ పైప్ ప్రొడక్ట్ సీఈవో రమేశ్ భూటాడా రూ.8.20 కోట్లు (పది లక్షల డాలర్లు) అందజేశారు. భూరి విరాళాన్ని అందించిన రమేశ్‌ను విశ్వవిద్యాలయ నిర్వాహకులు సన్మానించారు. ఈ విశ్వవిద్యాలయానికి వచ్చిన అతిపెద్ద విరాళం ఇదే. 1989లో ప్రారంభమైన హెచ్‌యూఏ 1993లో ఫ్లోరిడా ప్రభుత్వ గుర్తింపు పొందింది. నేటితరం యువత హిందూమతానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూ సంతృప్తికర జీవనవిధానాన్ని అవలర్చుకోవాలన్న సంకల్పంతో వర్సిటీకి ఈ విరాళం అందించినట్లు రమేశ్ పేర్కొన్నారు.













