మోదీ, అదానీ, జగన్ పై …. అమెరికాలో దావా
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలపై అమెరికాలోని భారత సంతతికి చెందిన డాక్టర్ లోకేశ్ ఉయ్యూరు అక్కడి కోర్టులో దావా వేశారు. వీరు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, పెగాసస్ స్పైవేర్ సాయంతో ప్రతిపక్షాలపై నిఘా పెట్టారని ఆరోపణలు చేశారు. దీంతో కొలంబియా జిల్లా కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. వరల్డ్ ఎనకామిక్ ఫోరం వ్యవస్థాపకుడు క్లాస్ స్క్వాబ్పై కూడా నమోదు చేశారు. వీరు అమెరికాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లోకేశ్ ఆరోపించారు. మే 24న ఈ దావా వేయగా, జూలై 22న కోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4న భారత్లో వీరికి నోటీసులు అందజేశారు.













