చరిత్రలోనే అతి కీలకమైన ఒప్పందం : రాజ్నాథ్ సింగ్
భారత్, వియత్నాం దౌత్య సంబంధాల చరిత్రలోనే అతి కీలకమైన సైనిక, రక్షణ పరికరాల ఒప్పందాలు ఇరుదేశాల మధ్య కుదిరాయి. 3 రోజుల పర్యటన కోసం వియత్నాం చేరుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలి రోజు జనరల్ ఫాన్ వాగ్ జియాంగ్తో భేటీ అయ్యారు. 2030 నాటికి సైనిక సంబంధాల విస్తరణ, తీరుతెన్నులపై తయారు చేసిన దార్మనిక పత్రంపై భారత్, వియత్నాం సంతకాలు చేశాయి. మిలటరీ పరికరాల సరఫరా, వినియోగంపై మరో కీలక ఒప్పందం ఖరారైంది. సరఫరాల తరలింపు, మరమ్మతులకు సైనిక స్థావరాలను పరస్పరం వినియోగించుకునేలా అంగీకారం కుదరింది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ చర్యలు కలవరపెడుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రక్షణ పరికరాల రవాణాలో ఇరుదేశాల చరిత్రలోనే తొలిసారి అతికీలకమైన ఎంవోయూ కుదిరింది. ఇలాంటి ఒప్పందం ఒక విదేశీ ప్రభుత్వంతో వియత్నాం కుదుర్చుకోవడం ఇదే ప్రథమం. వియత్నాం రక్షణ అవసరాల కోసం 50 మిలియన్ డాలర్ల రుణం మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు.













