భారత్ కు అగ్రరాజ్యం నుంచి.. యుద్ధ విమానాలు
అగ్రరాజ్యం అమెరికా నుంచి భారత్ అత్యంత శక్తిమంతమైన ఎఫ్/ఎ-18 బ్లాక్-3 సూపర్ హార్నెట్ రకం యుద్ధ విమానాలను, 30 మానవ రహిత ప్రిడేటర్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. వీటికి సంబంధించి చర్చలు జరపడానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏప్రిల్ నెలలో అమెరికాకు వెళుతున్నారు. సూపర్ హార్నెట్ విమానాలను అమెరికాలోనే తయారు చేసి వాటి సర్వీస్ ఆత్మనిర్భర్ పథకం కింద భారత్‌లోనే చేస్తారు. ఇందుకోసం భారత నౌకాదళం, బోయింగ్ కంపెనీ కలిసి పని చేస్తాయి. ఇక ప్రిడేటర్/ ఎంక్యూ9బీ రకం మానవ రహిత విమానాలు /డ్రోన్లను అమెరికాకు చెందిన జనరల్ ఆటోమిక్స్ కంపెనీ తయారు చేస్తోంది.













