యూఏఈ వెళ్లే వారికి శుభవార్త

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉపాది కోసం వెళ్లే కార్మికులకు శుభవార్త. జూలై 7వ తేదీ నుంచి యూఏఈకి భారత్ నుంచి విమానాలు ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రత కారణంగా ఏప్రిల్ 25 నుంచి మన దేశ విమానాల రాకపోకలపై యూఏఈ విధించిన నిషేధం జులై 6వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమానాలకు 7వ తేదీ నుంచి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో కొన్ని షరతులను విధించింది. భారత్ నుంచి యూఏఈకి వెళ్లే వలస కార్మికులు రెండు డోస్‍ల కోవిషీల్డు టీకా తీసుకుని ఉండాలి. అలాగే ప్రయాణానికి మూడు రోజుల ముందు ఆర్‍టీపీసీఆర్ టెస్టు చేయించుకుని నెగెటివ్‍గా నిర్దారించిన సర్టిఫికెట్‍ను చూపాల్సి ఉంటుంది.