భారత్ కీలక నిర్ణయం.. కెనడాకు
కెనడాకు పూర్తిస్థాయి వీసా సర్వీసులను నిలిపివేసిన భారత్ తన నిర్ణయాన్ని కొంతమార్చుకుంది. కొన్ని వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. భారత్ దౌత్యవేత్తల రక్షణ విషయంలో తాజాగా కెనడా తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిగణనలోకి తీసుకొని, భద్రతా పరిస్థితిని సమీక్షించాం. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించాం అని ఒటావాలోని భారత హై కమిషన్ తెలిపింది. ఖలిస్థాన్ వేర్పాటు వాది నిజ్జర్ హత్య విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం తలెత్తిన తర్వాత వీసాల జారీ ప్రక్రియను భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.













