యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ తిరిగి ఎన్నిక
ఐక్యరాజ్య సమితి మూడు రాజ్యాంగబద్దమైన సంస్థల్లో ఒకటైన యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు 2021-25 పదవీ కాలానికి భారత్ తిరిగి ఎన్నికైంది. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో భారత్కు 164 ఓట్లు లభించాయని యునెస్కోలో శాశ్వత ప్రతినిధి బృందం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, యునెస్కో భారత శాశ్వత ప్రతినిధి బృందం చేసిన మంచి పనిని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో భారత్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన దేశాలకు సాంస్కవృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కృతజ్ఞతలు తెలియచేశారు. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్కు చోటు దక్కడం ఆనందంగా వుందని వ్యాఖ్యానించారు.













