ఐరాసలో భారత్ ఆందోళన..

వ్యూహాత్మక ప్రదేశాలపై, వాణిజ్యపరమైన ఆస్తులపై ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడుతుండటం మీద ప్రపంచ దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని ఐరాస సాధారణ అసెంబ్లీలో భారత్ పేర్కొన్నది. ఇంటర్నెట్, సోషల్‍మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తి.. కొత్త పేమెంట్ విధానాలు, క్రౌడ్ ఫండింగ్‍తో ఉగ్రవాదులకు నిధుల చేరవేత వంటివి ఇప్పటికే పెను సవాళ్లు విసురుతున్నాయని, తాజాగా డ్రోన్ల రూపంలో మరో ముప్పు మంచుకొస్తున్నదని కేంద్ర హోంశాఖకు చెందిన ప్రత్యేక కార్యదర్శి వీఎస్‍కే కౌముది పేర్కొన్నారు.