చైనాను ఎదుర్కోవడంలో భారత్ కీలకపాత్ర : అమెరికా

భారత విదేశాంగ విధానం రాటుతేలిందని, 2020లో చైనా దూకుడును నిలువరించడంలో దృఢ వైఖరిని కనబరిచిందని అమెరికా సెనేటకు చెందిన సైనికల సేవల కమిటీ ఆ దేశ రక్షణ నిఘా సంస్థ డైరెక్టర్ స్కాట్ బెరియర్ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంత శాంతిభద్రతల పరిరక్షణలో తనకున్న ప్రాధాన్యాన్నీ భారత్ చాటుకుందని అన్నారు. సరిహద్దుల్లో పాకిస్థానీ ఉగ్రవాదుల ఆగడాలు, కశ్మీర్ తదితర అంశాల్లోనూ మోదీ ప్రభుత్వం పట్టుసడలనివ్వలేదని తెలిపారు. తూర్పు లద్దాఖ్‍లో ఆక్రమణకు యత్నించినా చైనాను ఎదుర్కోవడంలో 2020 ఏడాది అంతా మొదీ ప్రభుత్వం గట్టిగా నిలబడిందని తెలిపారు.