బ్రిటన్ కు భారత ప్రభుత్వం షాక్ … కచ్చితంగా 10 రోజుల పాటు
బ్రిటన్‌కు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొవిషీల్డ్‌ను పరిగణలోకి తీసుకునేది లేదని ప్రకటించిన యూకే ప్రభుత్వం మాట మార్చి సర్టిఫికేట్స్‌లో గందరగోళం నెలకొందంటూ బుకాయించింది. అయితే దీన్ని భారత్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న చందంగా భారత్ కూడా యూకే నుంచి వస్తున్న వారిపై ఆంక్షలు విధించింది. యూకే నుంచి వచ్చే వారిని అడ్డుకోమని, అయితే భారత్‌లో అడుగుపెట్టిన తరువాత, కచ్చితంగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే అంటూ హుకుం జారీ చేసింది. వ్యాక్సినేషన్ సంబంధం లేకుండా, బ్రిటీష్ పౌరులు అందరూ తప్పనిసరిగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందే అంటూ ప్రకటించింది. భారత్‌తో పాటు అనేక దేశాలను బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సిన్, టీకా సర్టిఫికేట్స్ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే.













