భారత విదేశాంగ విధానం సూపర్ : రష్యా
ఏ దేశం ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన ప్రయోజానాలు, అభివృద్ది, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్న భారత విదేశాంగ విధానం భేషుగ్గా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ ప్రశంసించారు. విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న ఎస్. జయశంకర్ నిజమైన దేశభక్తుడని, సరైన సమయంలో కీలకమైన శాఖకు సారథ్యం వహిస్తున్న గొప్ప వ్యక్తి అని మెచ్చుకున్నారు. ఆహారం, భద్రత, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాల్లో పశ్చిమ దేశాలపై తాము ఆధారపడలేమని, చాలా చాలా పాత మిత్రురాలైన భారత్ నుంచి చిన సహకారం కోరుకుంటామని అన్నారు. ఒకప్పుడు భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యమే ఉండేదని, కానీ రెండు దశాబ్దాల క్రితం ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతమై ప్రత్యేక, వూహ్యాత్మకంగా బంధంగా మారిందని గుర్తు చేశారు. ద్వైపాక్షిక బంధంలో ఇదో విభిన్నమైన మార్పుగా ఆయన అభివర్ణించారు.













