శ్రీలంకకు బహుమతిగా డోర్నియర్
శ్రీలంక సముద్ర భద్రత మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా డోర్నియర్ సముద్ర నిఘా విమానాన్ని భారత్ బహుమతిగా అందజేసింది. రెండు రోజుల పర్యటన కోసం శ్రీలంక వచ్చిన భారత నౌకాదళ వైస్ చీఫ్ అడ్మిరల్ ఘోర్మడే ఇండియన్ హైకమిషనర్ గోపాల్ బాగ్లేతో కలిసి విమానాన్ని శ్రీలంక అధికారులకు అందజేశారు. 76 స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో సముద్ర నిఘా విమానాన్ని శ్రీలంకకు బహుమతిగా ఇవ్వాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జరిగిన విమానం అప్పగింత కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పాల్గొన్నారు.













