ఆ దేశాల వాణిని భారత్ వినిపిస్తుంది : రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్యసమితి 78వ సర్వసభ్య సమావేశంలో భారత్ వర్ధమాన దేశాల వాణిని వినిపిస్తుంది. ఆ దేశాల సమస్యల పరిస్కారానికి ప్రాధాన్యమిస్తుంది. అంతర్జాతీయ సహకారం, సుస్థిరాభివృద్ధి, శాంతి సాధనకు భారత్ తన నిబద్ధతను ఈ సమావేశంలో పునరుద్ఘాటిస్తుంది. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాలి. అంతర్జాతీయ ఉగ్రవాద నిర్మూలనకు సమగ్ర అంతర్జాతీయ ఒప్పందం కుదరాలి అని సమితిలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సామాజికాభివృద్ధి సంఘం 62వ సమావేశానికి 1975 తరవాత తొలిసారిగా ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తోంది.













